వారేవా! అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం! | Sakshi
Sakshi News home page

వారేవా! అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం!

Published Sat, Mar 18 2023 9:39 PM

Amazfit GTR mini launched in India, price set at Rs 9,990 - Sakshi

ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ అమేజ్‌ ఫిట్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఫిట్‌నెస్ నుంచి ఫ్యాషన్ వరకు యాక్సెస్‌ చేసేలా అమేజ్‌ఫిట్‌ జీటీఆర్‌ మినీ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హ్యూమంగస్ బ్యాటరీ, సింగిల్‌ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం, బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేసేలా అద్భుతమైన ఫీచర్లు ఉన్న వాచ్‌ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

అమేజ్‌ఫిట్ జీటీఆర్‌ మినీ ధర ఎంతంటే?  
అమేజ్‌ఫిట్ జీటీఆర్‌ మినీ ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది. అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న  ఈ స్మార్ట్‌వాచ్‌ మిడ్‌నైట్ బ్లాక్, మిస్టీ పింక్, ఓషన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు.  

అమేజ్‌ఫిట్ జీటీఆర్‌ మినీ స్పెసిఫికేషన్‌లు 
అమేజ్‌ఫిట్ జీటీఆర్‌లో మినీ వాచ్.. 1.28 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్ డిస్‍ప్లేతో ఎలాంటి కండీషన్‌లో ఉన్నా వాచ్‌ను ఆపరేట్‌ చేసేందుకు వీలుగా ఉంటుంది. వీటితో పాటు స్మార్ట్‌వాచ్ బయోట్రాకర్‌ పీపీజీ, ఆప్టికల్ సెన్సార్‌, హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్‌, ఒత్తిడి స్థాయిని మానిటర్ చేస్తుంది. అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలను సిఫార్సు చేస్తుంది. అంతేనా బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేయడం దీని ప్రత్యేకత అని అమేజ్‌ ఫిట్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement