యూపీఐ ఆటోపే.. ఎయిర్‌టెల్ బ్యాంక్ సత్తా! | Airtel Payments Bank Revenue Jumps to Rs 3207 Crore | Sakshi
Sakshi News home page

యూపీఐ ఆటోపే.. ఎయిర్‌టెల్ బ్యాంక్ సత్తా!

May 24 2026 8:50 PM | Updated on May 24 2026 8:50 PM

Airtel Payments Bank Revenue Jumps to Rs 3207 Crore

డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి 73 శాతం వృద్ధితో రూ.109 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)లో నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. మరోవైపు  వార్షిక ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

2024–25లో రూ.2,709 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025–26 నాటికి రూ.3,207 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్‌ కస్టమర్ల డిపాజిట్‌ బ్యాలెన్స్‌ కూడా 26 శాతం వృద్ధితో రూ.4,612 కోట్లకు చేరింది.

యూపీఐ ఆటోపేలో దూకుడు: ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్‌ అందిస్తున్న ‘సేఫ్‌ సెకండ్‌ అకౌంట్‌’ కు కస్టమర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పేర్కొంది. ‘యూపీఐ ఆటోపే’ మ్యాండేట్స్‌ విభాగంలో రెండో అతిపెద్ద ప్లేయర్‌గా బ్యాంక్‌ అవతరించింది.

Advertisement
 
Advertisement
Advertisement