ఎయిర్‌టెల్‌ కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌: అదిరే ఆఫర్‌

Airtel launches new Xstream Fiber plan with 17 Premium OTTs and more - Sakshi

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌

17  ఓటీటీ లు, 350కి పైగా  టీవీ చానల్స్‌ ఉచితం

సాక్షి, ముంబై:  ప్రముఖ  టెలికాం సంస్థ  భారతి ఎయిర్‌టెల్‌  మూడు కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ. 1599, రూ. 1,099, రూ. 699 ల  విలువ  చేసే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్లలో ఎయిర్‌టెల్‌ 4కే ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో అపరిమిత డేటా, 350కి పైగా ఛానెళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాదు  17 ప్రీమియం  ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో  మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లను సబ్‌స్క్రైప్‌ చేసుకోవాలనే వినియోగదారులు ఎయిర్‌టెల్‌  అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను చూడొచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఎయిర్‌టెల్  తాజా రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ ఇప్పటికే ఉన్న రూ. 1,498 ప్లాన్‌లాంటిదే. కానీ, 4కే ఎక్స్‌స్ట్రీమ్  బాక్స్‌తో 350కి పైగా ఛానెళ్లకు యాక్సెస్‌ లభిస్తుంది. అయితే దీని కోసం రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది.ఇది వన్-టైమ్ ఛార్జ్. ఈ సెటప్ బాక్స్‌తో, వినియోగదారులు కేబుల్ టీవీతో పాటు  ఓటీటీ  కంటెంట్‌ను  ఎంజాయ్‌ చేయొచ్చు.

ఇందుల 300ఎంబీపీఎస్‌, ఇంటర్నెట్ వేగం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి టాప్‌ ఓటీటీలు ఉచితం. అంతేకాదు ఈ ప్లాన్‌లో SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TVలాంటి  17 ఓటీటీలు ఉచితం.  నెలకు 3.3టీబీ డేటా వాడుకోవచ్చు.

రూ. 1099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ఇందులో నెలకు 200ఎంబీపీఎస్‌ వేగంతో  3.3 టీబీ డేటా లభ్యం. ఇందులోనూ అన్ని ఓటీటీలు ఉచితం.  ఇక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆఫర్లో 350కి పైగా ఛానెల్స్‌  కూడా ఉచితం.

రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
సరసమైన ఈ ప్లాన్‌లో 40ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 3.3టీబీ డేటా  అందిస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మినహా పైన పేర్కొన్న అన్ని ఓటీటీలకు, టీవీ చానెల్స్‌కు యాక్సెస్‌  ఉంటుంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top