
ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతానికి ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా జూర్గెన్ వెస్టర్‌మీయర్‌ను నియమితులయ్యారు. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌బస్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న జూర్గెన్, రెమీ మైలార్డ్ స్థానంలో ఈ పదవిని చేపడతారు.
రెమీ మైలార్డ్ ఎయిర్‌బస్‌లో కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్‌గా నియమితులవుతారు. తన కొత్త పాత్రలో, జూర్గెన్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతంలో ఎయిర్‌బస్ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఇందులో కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్, డిఫెన్స్ అండ్ స్పేస్, హెలికాప్టర్లు ఉన్నాయి. కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అమ్మకాలకు బాధ్యత వహించనున్న జూర్గెన్ సర్వీసెస్, ఇంజనీరింగ్, డిజిటల్, ఇన్నోవేషన్, శిక్షణ రంగాలలో సంస్థ విస్తరణకు కృషి చేయనున్నారు.
జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ కార్ల్‌స్రూహే నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన జూర్గెన్.. తన కెరియర్ను 1998లో బీఎమ్‌డబ్ల్యూలో ప్రారంభించారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మోటార్‌సైకిల్స్ ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ అండ్ సప్లయర్ నెట్‌వర్క్, కాస్ట్ ఇంజనీరింగ్ రంగాలలో వ్యూహాత్మక స్థానాలలో పనిచేశారు. జూర్గెన్ 2020లో ఎయిర్‌బస్‌లో చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా చేరారు.అక్కడ ఆయన ఎయిర్‌బస్ విభాగాల్లో ప్రొక్యూర్‌మెంట్ బాధ్యతలు చూశారు