Airtel : జియోఫోన్‌కు పోటీగా...ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌...!

Ahead Of Jiophone Next Launch Bharti Airtel Considers Co Branded Smartphone With Bundled Data Offer - Sakshi

ముంబై: టెలికాం రంగంలో జియో రాకతో పలు సంస్థలకు కంటిమీద కునుకులేకుండాపోయింది. జియో మొబైల్‌ టారిఫ్‌ చార్జీలను గణనీయంగా తగ్గించడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా టారిఫ్‌ ఛార్జీలను తగ్గించాల్సి వచ్చింది. భారత టెలికాం రంగంలో తనదైన ముద్రను వేయడం కోసం జియో బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ను లాంచ్‌ చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్‌ కొరతతో జియోఫోన్‌ నెక్ట్స్‌ లాంచ్‌కు బ్రేకులు పడింది. జియోఫోన్‌ నెక్ట్స్‌ను దీపావళికి రిలీజ్‌ చేస్తోందని రిలయన్స్‌ ప్రకటించింది.  
చదవండి: రష్యాలో ఏమైంది..! దిగ్గజ టెక్‌ కంపెనీలపై వరుసగా...

కొత్త ప్లాన్‌తో ఎయిర్‌టెల్‌...!
జియోఫోన్‌ నెక్ట్స్‌ను ఎదుర్కొనేందుకుగాను ఎయిర్‌టెల్‌ కొత్తప్లాన్‌తో ముందుకు వస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో ఎయిర్‌టెల్‌ ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై బండిల్‌ డేటా ప్యాక్‌లను, వాయిస్‌ ఆఫర్లను అందించాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికతో ఎయిర్‌టెల్‌కు చెందిన 2జీ సబ్‌స్రైబర్స్‌ బేస్‌ను రక్షించుకోవాలనే లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది. 

పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో చర్చలను జరిపేందుకు ప్రతిపాదనలను ఎయిర్‌టెల్‌ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. లావా, కార్బాన్‌, హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో ఎయిర్‌టెల్‌ చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్‌టెల్ పలు కంపెనీల హ్యాండ్‌సెట్ బ్రాండ్‌లతో పొత్తుతో పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ఎయిర్‌టెల్‌ పలు ఆఫర్లను అందించాలని భావిస్తోంది. 
చదవండి: Paytm : మొబైల్‌ బిల్స్‌ పేమెంట్స్‌పై పేటీఎమ్‌ బంపర్‌ ఆఫర్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top