'హే ఎలన్‌ మస్క్‌'..సీరమ్‌ సీఈఓ అథర్‌ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు!

Adar Poonawalla To Elon Musk On Tesla In India - Sakshi

ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు, భారత్‌లో టెస్లా కార్ల తయారీపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అథర్‌ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలన్‌ మస్క్‌ను ఉద్దేశిస్తూ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. 

అదార్ పూనావాలా ట్విట్టర్‌లో ఎలన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేశారు. “హే ఎలన్‌ మస్క్‌ మీరు ట్విటర్‌ను కొనుగోలు చేయనట్లైతే..భారీ ఎత్తులో నాణ్యమైన టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కోసం భారత్‌లో కొంత మొత్తాన్ని పెట్టుబడులు పెట్టండి. ఇది మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి అవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.” అని పూనావాలా ట్వీట్ చేశారు.  

కాగా, ఎలన్‌ మస్క్‌ గతేడాది కర్ణాటకలో టెస్లా కార్లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. అదే సమయంలో మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు' రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలంటూ ఎలన్‌ మస్క్‌ను ఆహ్వానించాయి. అయితే గత నెలలో ఎలన్‌ మస్క్‌ పెట్టుబడులు పెట్టాలంటూ ఆయా రాష్ట్రప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయంటూ వచ్చిన నివేదికలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. 

"ఇది చాలా సులభమైన ప్రత్యామ్నాయం. మనదేశంలో టెస్లా తయారు చేసేందుకు ఎలన్‌ మస్క్‌ సిద్ధంగా ఉంటే ఎటువంటి సమస్యలేదు. ఇక్కడ అన్నీ సౌకర్యాలున్నాయి. కొనుగోలు దారులూ ఉన్నారు.  కానీ, ఎలన్‌ మస్క్‌ చైనాలో ఎలక్ట్రిక్‌ కార్లు తయారు చేసి..భారత్‌లో అమ్మాలని చూస్తున్నారు. అది మంచి ప్రతిపాదన కాదు. మా నిబంధనకు అంగీకరిస్తే మేం అన్నీ విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చదవండి👉నితిన్‌ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్‌మస్క్‌కు బంపరాఫర్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top