ఐటీ కంపెనీ 'యాక్షన్‌ స్టెప్‌' బంపరాఫర్‌, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు!

Actionstep Offering Unlimited Leaves To All Employees - Sakshi

సుదీర్ఘకాలం తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెప్పి తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. అదే సమయంలో ఐటీ కంపెనీలను అట్రిషన్ రేటుతో పాటు, గ్రేట్‌ రిజిగ్నేషన్‌ వంటి అంశాలు కలవరానికి గురి చేస్తున్నాయి. అందుకే కొత్త వర్క్‌ పాలసీల అమలుతోపాటు, భారీ ప్యాకేజీలిచ్చేందుకు సైతం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస‍్థ అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించింది. 

కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. కీలక రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది. కానీ కరోనా మహమ్మారిని తట్టుకొని నిలబడింది ఒక్క ఐటీ రంగం మాత్రమే. కరోనా వ్యాప్తిని ప్రారంభంలోనే గుర్తించిన ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ వెసలు బాటు కల్పించాయి. దీంతో కంపెనీలకు ఖర్చు తగ్గి.. అటు ఉత్పత్తి పెరిగింది. కానీ ఇప్పుడు కరోనా తగ్గి.. ఎక్కువ శాతం కంపెనీలన్నీ ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. కానీ అట్రిషన్‌, గ్రేట్‌ రిజిగ్నేషన్‌ సమస్యలు ఐటీ కంపెనీలను పట్టి పీడిస్తున్నాయి.   

ఈ నేపథ్యంలో న్యూజిల్యాండ్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ 'యాక్షన్‌ స్టెప్‌' ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త వర్క్‌ కల్చర్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు మనకు తెలిసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ను ఆయా సంస్థలు అమలు చేస్తుండగా.. యాక్షన్‌ స్టెప్‌ 'హైట్రస్ట్‌ మోడల్‌' వర్క్‌ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వర్క్‌ మోడల్‌  ద్వారా ఉద్యోగులు సంవత్సరంలో ఎన్ని సెలవులు కావాలంటే అన్ని తీసుకోవచ్చని' ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీవ్‌ మేహ్యూ అన్నారు. 

ఈ వర్క్‌ కల్చర్‌లో ఉద్యోగులు అవసరమైన సెలవులు తీసుకోవచ్చని, మళ్లీ ఆఫీస్‌కు తిరిగి రావొచ్చని స్టీవ్‌ తెలిపారు. ఈ కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చిన ప్రారంభంలో ఉద్యోగులు .. మేం 3 నెలలు సెలవులు తీసుకోవచ్చా? ఆఫీస్‌కు సెలవు పెడితే శాలరీ వస్తుందా? ఇలా ఎన్నో అనుమానాల్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. వారి అనుమానాల్ని నివృత్తి చేయడంతో సంస్థపై ఉద్యోగుల్లో నమ్మకం పెరిగిందని వెల్లడించారు.   

మినిమం నాలుగు వారాలు
యాక్షన్‌ స్టెప్‌ అపరిమిత సెలవులను అందిస్తున్నప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులను కనీసం నాలుగు వారాల సెలవులు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. సెలవులు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గుతుందని, వర్క్‌ ప్రొడక్టివిటీ పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు ఈ కంపెనీకి వరల్డ్‌ వైడ్‌గా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని కల‍్పించగా... ప్రతి సంస్థ ఈ తరహా వర్క్‌ మోడల్‌ను అమలు చేయాలని, ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మేహ్యూ పేర్కొన్నారు.

చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్‌ అదిరిపోయే ఆఫర్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top