సత్తుపల్లిరూరల్: బెటాలియన్ సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం కనబర్చాలని టీజీఎస్‌పీ బెటాలియన్ల డీఐజీ పి.మురళీకృష్ణ సూచించారు. సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత కమాండెంట్ ఎన్.పెద్దబాబు డీఐజీకి స్వాగతం పలికాక ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత బెటాలియన్‌లోని పరిపాలనా భవనం, ఇతర విభాగాలను పరిశీలించాక మాట్లాడారు. ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ, పోలీస్ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అదనపు కమాండెంట్ ఏ.అంజయ్య, ఉద్యోగులు బి.వేణుగోపాలరెడ్డి, బి.వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.
15వ బెటాలియన్‌లో తనిఖీ చేసిన
డీఐజీ మురళీకృష్ణ


