మణుగూరు టౌన్: ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై బుధవారం ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. మణికంఠనగర్లో లబ్ధిదారులు డబుల్బెడ్రూం ఇళ్లను విక్రయించుకుంటున్న తీరుపై ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచా రణ చేపట్టారు. ఎన్ని ఇళ్లు, ఎంతకు విక్రయించారనే వివరాలు సేకరించారు. ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా డబుల్బెడ్రూం లబ్ధిదారులుగా ఉన్నట్లు సమాచారం. కాగా విచారణ సమయంలోనే అశ్వాపురం మండలానికి చెందిన కొందరు డబుల్బెడ్రూం ఇల్లు కొనుగోలు చేసి రంగులు వేస్తుండటం గమనార్హం.


