నేటి నుంచి ‘చేయూత’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘చేయూత’

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

● జిల్లాలో కొత్తగా 16,198 మందికి పింఛన్‌ మంజూరు ● ఈ నెల 18 వరకు ప్రొసీడింగ్స్‌ పంపిణీ

పంపిణీ షెడ్యూల్‌ ఇలా..

● జిల్లాలో కొత్తగా 16,198 మందికి పింఛన్‌ మంజూరు ● ఈ నెల 18 వరకు ప్రొసీడింగ్స్‌ పంపిణీ

చుంచుపల్లి: ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 18,776 మంది దరఖాస్తు చేసుకోగా, 16,198 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరో 2,578 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు అధికా రులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు వారం రోజులపాటు లబ్ధిదారులకు మంజూ రు పత్రాలు (ప్రొసీడింగ్స్‌) అందజేయనున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో గ్రామసభల ద్వారా పంపిణీకి సెర్ప్‌ అధికారులు విస్తృత ఏర్పా ట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం అందించడం, గ్రామసభల నిర్వహణ, పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టారు.

వృద్ధులు, బీడీ కార్మికులకు

నిరాశ

కొత్త పింఛన్ల మంజూరుతో కొందరికి లబ్ధి జరుగనున్నా.. మరికొందరికి ఎదురుచూపులు తప్పడంలేదు. వృద్ధులు, బీడీ కార్మికులకు ఈసారీ నిరాశే ఎదురైంది. వయసు మీదపడటంతో కూలి పనులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, బీడీ కార్మికులు పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. అనారోగ్య సమస్యలు, వయోభారం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుటంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. గతంలో పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా కొత్తగా మంజూరు చేసే విభాగాల్లో వీటికి మినహాయింపు ఇచ్చారు. కొత్త పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిపోయిన అర్హుల దరఖాస్తులనూ పరిశీలించి తదుపరి విడతలో న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. కొత్త పింఛన్ల మంజూరుపై డీఆర్‌డీఓ ఎం.విద్యాచందనను సంప్రదించగా.. గురువారం నుంచి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేస్తామని తెలిపారు. పారదర్శకంగా విచారణ జరిపి అర్హులకు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కొత్తగూడెం అర్బన్‌/చుంచుపల్లి: జిల్లాలో గురువారం నుంచి చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రొసీడింగ్స్‌ పంపిణీ అందజేయనున్నారు. 12న మధ్యాహ్నం 3.30 గంట లకు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు కొత్తగూడెం క్లబ్‌లో, 13న ఉద యం 10 గంటలకు సుజాతనగర్‌లోని రైతువేదికలో, ఉదయం 11 గంటలకు కొత్తగూడెం మున్సి పాలిటీ పరిధిలో కొత్తగూడెం క్లబ్‌లో పంపిణీ చేపడతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పాల్వంచ మండలం, మున్సిపాలిటీ పరిధిలో పంపిణీ చేస్తారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో 13న ఉదయం 10 గంటలకు అశ్వారావుపేట మండలం, మున్సిపాలిటీలో పంపిణీ చేపడతారు. మధ్యాహ్నం 2 గంటలకు దమ్మపేట మండలంలో కార్యక్రమం నిర్వహిస్తారు. 14న మధ్యాహ్నం 2 గంటలకు ములకలపల్లి మండలంలో, 15న ఉదయం 10 గంటలకు చండ్రుగొండ మండలంలో, మధ్యాహ్నం 2 గంటలకు అన్నపురెడ్డిపల్లి మండలంలో ప్రొసిడింగ్స్‌ పంపిణీ జరగనుంది.

ఈ మేరకు కలెక్టర్‌ అంకిత్‌ బుధవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లబ్ధిదారులు నిర్ణీత సమయాలు, కేటాయించిన పంపిణీ కేంద్రాలకు చేరుకుని పింఛన్లు స్వీకరించాలని డీఆర్‌డీఏ అధికారులు కోరారు. తదుపరి షెడ్యూల్‌లో మిగతా మండలాల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement