నైతిక విలువలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నైతిక విలువలు పాటించాలి

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

రుద్రంపూర్‌: ప్రతీ ఉద్యోగి నైతిక విలువలు పాటించాలని సాఫ్ట్‌ స్కిల్‌ ట్రైనర్‌ ఎన్‌ఎల్‌పీ ప్రాక్టీషనర్‌ కిషోర్‌ బగాడియా అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బుధవారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవా లలో భాగంగా రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాల అధికారులకు ‘నిజాయితీ ద్వారా సమృద్ధి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారదర్శకతతో కూడిన సేవలు, నిజాయితీతో కూడిన విధానాలు సంస్థల అభివృద్ధికి దోహదపడతా యని అన్నారు. అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎంలు సీహెచ్‌ శ్రీనివాస్‌, జి.దేవేందర్‌, విజయప్రసాద్‌ మురళీధర్‌ రాజు, కే.రామ్మోహన్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి

పరీక్షలకు ఎంపిక

ఇల్లెందు: రాష్ట్ర గోసేవ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గోవిజ్ఞాన రాష్ట్రస్థాయి పరీక్షలకు ఇల్లెందుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇల్లెందు పాత గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బానోత్‌ రాజేశ్వరి, కున్నోత్‌ నిఖిత రాష్ట్రస్థాయి పరీక్షలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం భావ్‌సింగ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పలువురు అభినందించారు.

9 రెస్టారెంట్ల లైసెన్స్‌లు సస్పెండ్‌

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో ఆహార భద్రతా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని తొమ్మిది రెస్టారెంట్ల లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. వీటిలో సాయిదుర్గా, గీతాంజలి, గౌతమి స్పైసీ, రాఘవేంద్ర, స్వాతి, అన్నపూర్ణ, నాగ సత్య బిర్యానీ పాయింట్‌, ఎస్‌ఆర్‌కే, అనిల్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. కోసల, చందమామ, న్యూ వెన్నెల మెస్‌ల నిర్వహణలో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. 565 కిలోల నాణ్యత లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు.

రేక్‌ పాయింట్‌కు రూ.2,646 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు కోరమాండల్‌ కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్‌ టన్నుల యూరియా బుధవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,046 మె. టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 800 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 700 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఏఓ పుల్లయ్య తెలిపారు. మరో వంద మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

నేడు కాంట్రాక్టర్ల

జిల్లాస్థాయి సమావేశం

పాల్వంచరూరల్‌: మండల పరిధి పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలోని పెద్దమ్మతల్లి ఫంక్షన్‌హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు కాంట్రాక్టర్ల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కాంట్రాక్టర్‌, మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల పరిధి లోని పెండింగ్‌లోబిల్లులు, అధికారులతో ఎదురవుతున్న సమస్యలు, కాంట్రాక్టర్ల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు.

కొడిసెలగూడెంలో

కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌

దమ్మపేట: మండలంలోని అంకంపాలెం గ్రామపంచాయితీ పరిధి కొడిశెలగూడెంలో బుధవారం తెల్ల వారుజామున పోలీసులు కార్డెన్‌ అండ సెర్చ్‌ నిర్వహించారు. అశ్వారావుపేట సీఐ నాగరాజురెడ్డి ఆధ్వర్యాన మొత్తం 52 ఇళ్లల్లో సోదా లు చేశారు. ఈ సందర్భంగా బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్‌ పత్రాలను తనిఖీ చేసి, నాలుగు ద్విచక్ర వాహనాల యజమానులకు జరిమానా విధించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, గంజాయి అమ్మకాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. రోడ్డు భద్రత, సైబర్‌ నేరాల కట్టడిపై అవగాహన కల్పించారు. దమ్మపేట, అశ్వారావుపేట ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement