ఒకరు మృతి
అన్నపురెడ్డిపల్లి: మండలంలోని గుంపెన శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చండ్రుగుండ మండలం రామక్క బంజర్ గ్రామానికి చెందిన పద్దం వెంకటేశ్వరరావు(41) తన ట్రాక్టర్‌పై ఎర్రగుంట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వెళ్తున్న బొగ్గు టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్ పక్కకు పడిపోగా, వెంకటేశ్వరరావుకు తలకు తీవ్రగాయాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమారుడి దాడిలో తండ్రి మృతి
దుమ్ముగూడెం: కుమారుడు దాడి చేయడంతో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందా డు. ఈ ఘటనలో కుమారుడిపై బుధవారం పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బండిరేవు గ్రామానికి చెందిన మేకల తాతయ్య(84) కుమారుడు ధనుంజయ్ జులాయిగా తిరుగుతూ నిత్యం ఇంట్లో గొడవలు చేస్తున్నాడు. తండ్రి పేరిట ఉన్న ఎకరం పొలం తన పేరు మీద రాయాలని, తనకు పెళ్లి చేయాలని వేధిస్తున్నాడు. ఈ నెల 2న రాత్రి తండ్రి ఎదురింటి ముందు పడుకుని ఉండగా ధనుంజయ్ సెంట్రింగ్ రాడ్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలు కాగా, కుటుంబసభ్యులు భద్రాచలం, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తాతయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు చర్ల సీఐ రాజువర్మ, ఎస్‌ఐ శ్యామ్‌ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
11 కేజీల
గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 11.6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా, ద్వి చక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు. వీరిని విచారించగా సిద్దిపేట జిల్లా భరత్‌నగర్‌కు చెందిన కాల్వ వెంకటేశ్, కోడూరు సురేశ్‌గా తేలింది. రూ.6.90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకోగా, తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ సీహెచ్.శ్రీహరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.


