పెనుబల్లి: విద్యార్థులు గెలుపునకు పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా ముందుకు సాగాలని.. ప్రతీ ఓటమి తర్వాత పట్టుదలగా ముందుకు సాగితే విజయం దరిచేరుతుందని సత్తుపల్లి ఎంఎల్‌ఏ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. మండలంలోని కుప్పనకుంట్ల మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి బాలుర క్రీడాపోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ విద్యారంగం, విద్యార్థుల అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో తర్ఫీదు పొందితే మానసిక, శారీరక దృఢత్వం సొంతమవుతుందని తెలిపారు. పోటీల్లో స్నేహపూర్వకంగా ముందుకు సాగి గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి చేసిన ఎమ్మెల్యే క్రీడాకారుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించడమే కాక వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ సీహెచ్.రాంబాబు, సీఐ సరవయ్య, ప్రిన్సిపాల్ ఎ.జ్యోతితో పాటు నాయకులు, ఉపాధ్యాయులు, డాక్టర్ మట్టా దయానంద్, బుక్కా కృష్ణవేణి, భవాని, వినీల, పి.వెంకటేశ్వరావు, సోమరాజు సీతారామారావు, కీసర శ్రీనివాసరెడ్డి, పసుమర్తి విశ్వనాధ్, మాధవరెడ్డి, కిరణ్, చిన్న స్వామి, వంగా గిరిజ, రాధాకృష్ణ పాల్గొన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి


