ఒకే విద్యార్థి.. ఒకే టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకే విద్యార్థి.. ఒకే టీచర్‌

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

టేకులపల్లి: మండలంలోని దాస్‌ తండా పంచాయతీ పరిధి లచ్యాతండా ప్రాథమిక పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత విద్యా సంవత్సరంలో ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేశారు. ఈ ఏడాది ముగ్గురే విద్యార్థులు ఉండటంతో, విద్యాశాఖ అధికారులు ఒక ఉపాధ్యాయుడిని నరసాయిగూడెం పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపారు. రికార్డుల ప్రకారం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నా, ప్రస్తుతం ఒక్కడే పాఠశాలకు వస్తున్నాడు. ముగ్గురిలో ఐదో తరగతి బాలిక టేకులపల్లి ప్రాథమిక పాఠశాలకు, మూడో తరగతి విద్యార్థి ఏ కాలనీతండా పాఠశాలకు వెళ్తున్నారు. మిగిలిన దివ్యాంగ బాలుడిని మాత్రమే రోజూ తల్లిదండ్రులు బడికి తీసుకొస్తున్నారు. అయితే, పాఠశాల మూతబడితే గ్రామంలో విద్య దూరమవుతుందనే భయంతో సర్పంచ్‌, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు స్థానిక పిల్లలను బడిలో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఏకై క ఉపాధ్యాయురాలిని ఇక్కడి నుంచి బదిలీ చేస్తే పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement