ఖమ్మంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు, భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రులు సమావేశం కాగా, జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనుల పునఃప్రారంభం, సీతారామ ఎత్తి పోతల పథకం, జూలూరుపాడు టన్నెల్, వెంకమ్మచెరువు కాలువ, పెద్దవాగు పునరుద్ధరణ, కాల్వలకు బదులు పైపుల ఏర్పాటు ప్రతిపాదనలను మంత్రి తుమ్మల వివరించారు. అలాగే, ఖమ్మంలో మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం, లకారం చెరువుకు నీటి మళ్లింపు, ధంసలాపురం పెద్దచెరువు, ఖానా పురం చెరువు అభివృద్ధి, టేకులపల్లి వద్ద సాగర్ కాల్వపై గైడ్‌వాల్ నిర్మాణం, దోమలవాగు చెరువు సామర్థ్యం పెంపు, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం, సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలి స్తే రైతులకు సాగునీటి వసతులు మెరుగుపడతాయని, ఖమ్మం నగరానికి తాగునీటి భద్రత, వరద ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని వివరించగా మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు.
సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష


