భద్రాచలం: పీవీటీజీ గ్రామాల్లో వీబీ జీ రామ్‌జీ (ఉపాధిహామీ) పథకం కింద నిర్దేశించిన పనుల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని ఐటీడీఏ ఏపీఓ (జనరల్) డేవిడ్ రాజ్ తెలిపారు. బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతి, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. ఐటీడీఏ నుంచి హాజరైన ఏపీఓ మాట్లాడు తూ పీవీటీజీ గ్రామాల్లో పనుల అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకు డు గుంతల నిర్మాణం, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు, వ్యవసాయ కుంటల ఏర్పాటు పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. డీఎస్వో ప్రభా కర్‌రావు, బీఆర్‌ఎల్‌జీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జీసీసీ అకౌంట్స్ పరిశీలన
భద్రాచలంలోని జీసీసీ కార్యాలయానికి సంబంధించిన అకౌంట్స్‌ను బుధవారం ఏపీఓ పరిశీలించారు. డీఆర్ డిపోలు, జీసీసీ కార్యాలయం ద్వారా నిత్యావసర సరుకులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అకౌంట్ పుస్తకాలు, ఇతర రికార్డులు తనిఖీ చేశారు. జీసీసీ మేనేజర్ సమ్మయ్య పాల్గొన్నారు.


