ఉక్కిరిబిక్కిరి! | - | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి!

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

● ‘మహాలక్ష్మి’ రద్దీకి అనుగుణంగా పెరగని సర్వీసులు ● రెండేళ్లలో 12.34 కోట్ల మంది మహిళల ప్రయాణం ● ప్రవళిక ఘటనతో ఆర్టీసీలో భద్రతా చర్యలు

సెప్టెంబర్‌ వరకు డిపోల వారీగా

మహిళా ప్రయాణికుల వివరాలు

డోర్లు పనిచేసేలా చర్యలు..

సర్వీసులు పెంచి..

సిబ్బందికి భద్రత కల్పించాలి

ఉచిత ప్రయాణం..
● ‘మహాలక్ష్మి’ రద్దీకి అనుగుణంగా పెరగని సర్వీసులు ● రెండేళ్లలో 12.34 కోట్ల మంది మహిళల ప్రయాణం ● ప్రవళిక ఘటనతో ఆర్టీసీలో భద్రతా చర్యలు

చుంచుపల్లి: ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..వారికి ఆర్థికంగా ఊరట కలిగిస్తోంది. ఇదే సమయాన పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు, సర్వీసులు, సిబ్బంది పెరగకపోవడం సమస్యలకు దారి తీస్తోంది. సీట్లన్నీ నిండిపోయినా ప్రయాణికులు ఎక్కుతూనే ఉండటంతో తలుపుల వద్ద, మెట్లపై, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇటీవల మణుగూరు డిపో కండక్టర్‌ ప్రవళిక మృతి ఘటన బస్సుల్లో భద్రతా లోపాలను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో యాజమాన్యం అప్రమత్తమై బస్సులకు తలుపులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులు ఎక్కిన తర్వాతే బస్సులను కదిలించాలని ఆదేశించింది. భద్రతా చర్యలు సరైనవే అయినా పెరిగిన రద్దీకి తగినట్లు సర్వీసులు పెంచితేనే ప్రయోజనం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.

12.34 కోట్ల మంది మహిళల ప్రయాణం..

మహాలక్ష్మి పథకం ప్రారంభమైన 2023 డిసెంబర్‌ 9 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఖమ్మం రీజియన్‌లో మహిళా ప్రయాణాల సంఖ్య 12,34,10,796కు చేరింది. రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో రోజుకు సగటున 1,20,754 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఖమ్మం డిపో పరిధిలో అత్యధికంగా 3.04 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు పథకం వినియోగాన్ని తెలియజేస్తున్నప్పటికీ.. బస్సులపై పెరుగుతున్న భారాన్నీ స్పష్టం చేస్తున్నాయి.

బస్సులకు తలుపులు.. భద్రతకు పెద్దపీట

ప్రవళిక మృతి ఘటన నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు భద్రతా చర్యలకు ఉపక్రమించారు. ప్రతీ బస్సుకు తలుపు ఉందా, లేదా.. ఉంటే పని తీరు ఎలా ఉందో పరిశీలించాలని ఆదేశించారు. అంతేకాక ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత తలుపులు మూశాకే బస్సులను కదిలించాలని సూచించారు. ఖమ్మం రీజియన్‌ పరిధిలో ఏడు డిపోఏల పరిధిలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మొత్తం 652 బస్సులలో డోర్ల పనితీరు, ల్యాచెస్‌ (తాళాలు), సేఫ్టీ గ్రిల్స్‌ను మెకానికల్‌ విభాగాలు పరిశీలిస్తున్నాయి. పాడైపోయిన డోర్లను వెంటనే బాగు చేయడం, తలుపులు లేని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు తక్షణమే కొత్త డోర్లను అమర్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఇప్పటివరకు 28 బస్సులను తనిఖీ చేయగా.. పదింటి తలుపులను సరిచేశారు. మిగతా వాటి పరిశీలన కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు సర్వీసుల్లో రద్దీ అధికంగా ఉండడంతో వీటిపై ప్రధానంగా దృష్టి సారించారు. బస్సులు కదులుతున్నప్పుడు ఫుట్‌బోర్డుపై నిలబడటం, ఎక్కే సమయంలో తోపులాటలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు రద్దీని నియంత్రిస్తూ టికెట్లు జారీచేయడం, సమయపాలన పాటించడం కండక్టర్లు, డ్రైవర్లకు సవాలుగా మారింది. అయితే, తలుపుల ఏర్పాటు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని, రద్దీ మార్గాల్లో అదనపు బస్సులు, ప్రత్యేక ట్రిప్పులు నడిపిస్తేనే ప్రయాణం సురక్షితంగా సాగుతుందనే భావన వ్యక్తమవుతోంది.

డిపో మహిళలు రోజుకు

సరాసరి సంఖ్య

ఖమ్మం 3,04,22,883 29,767

మధిర 1,38,81159 13,582

సత్తుపల్లి 2,14,38,330 20,976

భద్రాచలం 1,48,68,767 14,549

కొత్తగూడెం 1,81,73,426 17,782

మణుగూరు 1,86,37,062 18,236

ఇల్లెందు 59,89,169 5,860

మొత్తం 12,34,10,796 1,20,754

ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల్లోని బస్‌ల డోర్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ డిపోల పరిధిలోని బస్‌ల డోర్లను పరిశీలన చేయిస్తున్నాం. దీనిపై కండక్టర్లకు కూడా అవగాహన కల్పిస్తాం. డోర్‌ క్లోజ్‌ చేయకుండా స్టేజి నుంచి ముందుకు కదలొద్దని ఆదేశిస్తాం.

– ఏ.సరిరామ్‌, రీజినల్‌ మేనేజర్‌, ఖమ్మం

ఆర్‌టీసీలో మహాలక్ష్మి పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అందు కు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉంది. సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఫుట్‌బోర్డు ప్రయాణాలు ప్రమాదా లకు దారితీస్తున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లపై పని ఒత్తిడి కూడా పెరుగుతోంది. తక్షణమే అదనపు బస్సులు నడిపి ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. – భాస్కర్‌, ఈయూ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement