అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. ఈమేరకు పనుల ప్రతిపాదనలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే మంగళవారం హైదరా బాద్‌లో అందజేశారు. ఖమ్మం ఎంపీ రామసహా యం రఘురాంరెడ్డి, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, అశ్వారావుపేట మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జూపల్లి రమేష్‌తో పాటు మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ప్రతిపాదనలను సమర్పించారు. మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో సీసీరోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 35.52 కోట్లు, భగత్‌సింగ్‌ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ నగర్‌ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4.33కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం వాహనాల కొనుగోలుకు రూ.2కోట్లు, ఎల్‌ఈడీ వీధిదీపాలకు రూ.25లక్షలు, తాగునీటి పైప్‌ లైన్ల ఏర్పాటుకు రూ.50 లక్షలు, మోటార్లు, పంపుసెట్ల ఏర్పాటుకు రూ.25 లక్షలు కేటాయించాలని ప్రతిపాదనలు అందజేశారు.

మంత్రి శ్రీహరికి ఎమ్మెల్యే జారె వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement