చోరీల కేసుల్లో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీల కేసుల్లో ముగ్గురి అరెస్ట్‌

Nov 8 2026 12:25 AM | Updated on Nov 8 2026 12:25 AM

● రూ.27.51 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌రాజ్‌

టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో తనిఖీ

● రూ.27.51 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌రాజ్‌

ఇల్లందు: ఇల్లెందు కేంద్రంగా వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.27.51 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగా, వివరాలను శనివారం ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ రోహిత్‌రాజ్‌ వెల్లడించారు. ఇల్లెందుకు చెందిన లోద్‌ విశాల్‌ కుమార్‌, లోద్‌ గౌతమ్‌, కళ్యాణ్‌ కోరి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చోరీలు మొదలుపెట్టారని తెలిపారు. జేకే కాలనీ, సింగరేణి నివాస గృహాలు, సుభాష్‌నగర్‌, ఆజాద్‌నగర్‌, వెంగళరావునగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేశారని చెప్పారు. వీరిలో ఇద్దరు పీజీ పూర్తి చేయ డం గమనార్హం. కాగా, నిందితుల నుంచి 165 గ్రాముల బంగారం, రెండు కిలోల 205 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పది చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ రవికి ఎస్పీ నగదు పురస్కారం అందజేయగా, డీఎస్పీ ఉప్పలపాటి వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్‌ను అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు ఉమ, సారంగపాణి, సిబ్బంది పాల్గొన్నారు.

ఫింగర్‌ ప్రింట్‌, క్లూస్‌ టీమ్‌ విభాగాలు పరిశీలన

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని ఫింగర్‌ ప్రింట్‌, క్లూస్‌ టీమ్‌ విభాగాలను ఎస్పీ రోహిత్‌రాజ్‌ శనివారం పరిశీలించారు. ఆయా విభా గాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరి కరాలు, నేర పరిశోధనలో వాటి వినియోగం, ఇప్పటికే పరిష్కరించిన కేసుల వివరాలను ఆరా తీసి ఉద్యోగులకు సూచనలు చేశారు.

టేకులపల్లి: టేకులపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ రోహిత్‌ రాజు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణ, కార్యాలయ పరిసరాలను పరిశీలించాక పెండింగ్‌ కేసులు విచారణపై సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిందితులను గుర్తించాలని సూచించారు. సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి, ఏఎస్‌ఐ బోడిక నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement