కార్డెన్ సెర్చ్‌లో డీఎస్పీ రవీంద్రరెడ్డి
మణుగూరు టౌన్: అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించా లని మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి సూచించా రు. మణుగూరు మున్సి పాలిటీ పరిధి కమలాపురంలో శనివారం తెల్ల వారుజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల ఆధార్‌కార్డులను పరిశీలించడమే కాక సరైన పత్రాలు లేని 56 మోటార్ సైకిళ్లు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏడు నివా సాల్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.18,300 విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, వాహనాల్లో సరైన ధ్రువపత్రాలు లేకపోవడమే కాక గంజాయి విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. తనిఖీల్లో సీఐ నాగబాబు, మణుగూరు, అశ్వాపురం ఎస్‌ఐలు నగేశ్, రవూఫ్, శాంతి తదితరులు ఉన్నారు.
ఇసుక క్వారీ నుంచి రూ.80వేల బాకీ
డబ్బు ఇప్పించాలంటూ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి
మణుగూరు టౌన్: ఓ ఇసుక క్వారీలో పని చేసి న తనకు డబ్బులు ఇవ్వ డం లేదంటూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించా డు. మణుగూరు బాపనకుంట ఏరియాకు చెందిన చంద్రశేఖర్ గుండ్లసింగారం ఇసుక క్వారీలో పనిచేశాడు. సుమారు ఆరు నెలల పనికి రూ.80వేలు రావాల్సి ఉండగా, ర్యాంపు నిర్వాహకులు ఫోన్ ఎత్తకుండా వేధిస్తున్నారని చెబుతూ శనివారం గాంధీబొమ్మ సెంటర్‌లోని వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. డబ్బులు చెల్లించకపోతే దూకుతానని పేర్కొనగా, కుటుంబ సభ్యులు వేడుకున్నా వినలేదు. చివరకు సీఐ నాగబాబు న్యాయం చేస్తానని నచ్చచెబుతుండగా, ఆయన ఫోన్‌లో మాట్లాడే క్రమాన సిబ్బంది పైకి వెళ్లి చాకచక్యంగా చంద్రశేఖర్‌ను కిందకు తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లో పిటీషన్ ఇస్తే విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.


