●రెండో స్థానాన నిలిచిన కొత్తగూడెం యూసీఈఈ
ఖమ్మం: రెండు రోజులుగా ఖమ్మంలో జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. ఈమేరకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ – కొత్తగూడెం యూసీఈఈ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 91 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం యూసీఈఈ జట్టు చివరి వరకు పోరాడినా 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఖమ్మం జోన్ క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు డాక్టర్ కోటయ్య, గోపీకష్ణ, జె.ఉపేందర్, ఎం.డీ.మతిన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పురస్కారాలకు
దరఖాస్తులు
కొత్తగూడెంఅర్బన్: రానున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో దివ్యాంగుల సాధికారతకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ తార తెలిపారు. వ్యక్తిగత కేటగిరీతో పాటు సంస్థల ఆధ్వర్యాన కృషి చేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు విధానం, పూర్తి మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఈనెల 16వ తేదీలోగా తగిన ధ్రువీకరణ పత్రాలతో తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.


