సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరును మరింత మెరుగుపడాలని, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ, వీబీజీ రామ్‌జీ, చేయూత పెన్షన్ల వెరిఫికేషన్, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.


