భద్రాచలంటౌన్: హైదరాబాద్ నుంచి వచ్చిన ఆహార భద్రతా శాఖ స్పెషల్ టార్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం హోటళ్లు, రెస్టారెంట్లపై మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 11 రెస్టారెంట్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో నాలుగింటికి మెరుగుదల నోటీసులు జారీ చేశారు. వినియోగానికి పనికిరాని 565 కిలోల నాసిరకం ముడి ఆహార పదార్థాలను గుర్తించి తొలగించారు. హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.


