అశ్వారావుపేట : మురసు తుపాన్ బాధితులకు ప్రభుత్వం ఉండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. మండలంలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం వారు పరిశీలించారు. కోతకు గురైన గుమ్మడిపల్లి ప్రాజెక్ట్ రింగ్ బండ్, మున్సిపాలిటీలో ముంపునకు గురైన కాలనీలను సందర్శించారు. దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలు, రహదారులు, చెరువులను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్ వైద్యం వంటి అత్యవసర సేవల్లో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి


