● వరద నుంచి బయటపడిన సిబ్బంది, మత్స్యకారులు ● ఆనందం వ్యక్తం చేసిన కుటుంబీకులు
సత్తుపల్లిటౌన్: దాదాపు 10 – 12 గంటల పాటు సత్తుపల్లి మండలం బేతపల్లి వరద ప్రవాహంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు చిక్కుకున్నారు. చుట్టూ చిమ్మచీకటి, కనుచూపు మేర వరద.. అందరికీ ఈత వచ్చినా నీటిలో దిగితే ఎటు వెళ్తారో తెలియక చెట్లు, బండలను ఆసరా చేసుకుని గడిపారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం కృషితో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా వారు ఒడ్డుకు చేరగానే గంటల తరబడి ఎదురుచూసిన కుటుంబీకులు ఆనందంతో ఆలింగం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు...


