పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

● భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ● పుష్కరాల ఏర్పాటు పనులు పరిశీలన

● భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ● పుష్కరాల ఏర్పాటు పనులు పరిశీలన

భద్రాచలం: గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌, భక్తుల రాకపోకలు, రద్దీ నియంత్రణ, హోల్డింగ్‌ కేంద్రాల ఏర్పాట్లపై దృష్టి సారించామని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ అన్నారు. గురువారం ఆయన పార్కింగ్‌ ప్రదేశాలు, ఘాట్లు, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. గోదావరి కరకట్ట దిగువన జరుగుతున్న పుష్కర ఘాట్‌ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అభయాంజనేయస్వామి ఆలయం నుంచి సీతానిలయం వరకు రోడ్డు విస్తరణపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. 80 అడుగుల వెడల్పుతో విస్తరించే అవకాశాలపై సమీక్షించారు. ఆ తర్వాత డీఎస్పీ అరుణ్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులతో కలిసి సారపాక వైపు పుష్కరవనం, భద్రాచలం చర్ల రోడ్డులోని త్రివేణి స్కూల్‌, జూనియర్‌ కళాశాల మైదానం, కూనవరం రోడ్డులోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈసారి అదనపు పార్కింగ్‌ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్‌ కేంద్రాలు, తాత్కాలిక బస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూ లైన్లు, స్టేడియంలో ప్రత్యేక సెక్టార్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మోతె వద్ద ఉన్న పుష్కర ఘాట్‌ను సైతం సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement