రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభం

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్‌–17 అథ్లెటిక్స్‌ పోటీలు బుధవారం ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి నైపుణ్యాలు పెంచుకునేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి పోటీలు సమీపించడంతో వాతావారణం అనుకూలించకపోయినా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి వై.చిన్ని పాల్గొన్నారు.

అండర్‌–17 పోటీలకు

500మంది అథ్లెట్ల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement