ములకలపల్లి: వరుస తుపాన్ల నేపథ్యంలో హాస్టల్ ఆవరణలో మురుగునీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, విధిగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మండల పరిధి లోని కమలాపురం ఆశ్రమ హాస్టల్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో వసతి గృహానికి వచ్చిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ పక్కాగా అమలు చేయాలని, తాజా కూరగాయాలే వంటల్లో వినియోగించాలని స్పష్టం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం స్టోర్‌రూం, కిచెన్‌లను పరిశీలించారు. ఆర్‌ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సత్వరమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. తహసీల్దార్ స్వాతిబిందు, ఎంఈఓ సత్యనారాయణ, ఉపాధ్యాయుడు రాంకిషన్, పీఈటీ నాగప్రత్యూష తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీ ఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ బ్యాకప్, భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్ల య్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


