అశ్వారావుపేటరూరల్: తుపాన్ నేపథ్యంలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో మంగళవారం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్దగల పెద్దవాగు ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని వాగుల ద్వారా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ఒక గేటు ఎత్తివేసి సుమారు 4200 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 0.154 టీఎంసీ కాగా, తాజాగా 1.5 మీటర్లు వరదనీరు చేరినట్లు ఏఈఈ రియాజ్ తెలిపారు.


