కమనీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య కల్యాణం

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

‘నవోదయ’

హాల్‌ టికెట్లు విడుదల

ఈ నెల 28న ఆరో తరగతి ప్రవేశ పరీక్ష

కరకగూడెం: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయని కరకగూడెం నవో దయ పాఠశాల ప్రిన్సిపాల్‌ రత్నయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్‌వీఎస్‌ అడ్మిషన్‌ పోర్టల్‌ https:// cbseitms. rcil. gov. in/ nvs ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కండక్టర్‌ ప్రవళిక ఆరోగ్యం విషమం

అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం వద్ద గత నెల 25న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు తోసివేయడంతో బస్సు టైర్ల కిందపడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలై హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్‌ ప్రవళిక ఆరో గ్యం మంగళవారం విషమించింది. పది రోజులుగా ఆమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్ల నాయకులు పరామర్శించి ఆరో గ్యంపై వైద్యులతో మాట్లాడారు. మంగళవా రం ఉదయం అకస్మాత్తుగా బీపీ లెవల్‌ పడిపోయి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపినట్లు మణుగూరు ఆర్టీసీ డీఎం వెల్లడించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. బీపీ లెవల్‌ పెరగకపోవడంతో చికిత్సకు అవయవాలు సహకరించడం లేదని వైద్యులు తెలి పారు. మణుగూరు డిపో మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌, ఆర్టీసీ యూనియన్ల నాయకులు ఆస్పత్రికి వెళ్లి ప్రవళిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత

ఎస్పీ రోహిత్‌ రాజు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని 6వ బెటాలియన్‌ను మంగళవారం సందర్శించారు. సిబ్బంది నుంచి గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న మెన్‌ బ్యారెక్స్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ ఎస్‌ శ్రీధర్‌ రాజా, అసిస్టెంట్‌ కమాండెంట్లు ఏవీ రమణ య్య, రామకృష్ణారెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు జె.లెనిన్‌ బాబు, సీహెచ్‌వీ శ్రీనివాసరెడ్డి, జీవీ రామారావు, బి జానయ్య, బెటాలియన్‌ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement