మురసు.. ముసురు! | - | Sakshi
Sakshi News home page

మురసు.. ముసురు!

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

16 మండలాల్లో

వర్షాభావ పరిస్థితులు

ధరల పతనంతో

రైతులకు రెట్టింపు దెబ్బ

తుపాన్‌ ప్రభావంతో

రెండు రోజులుగా వర్షాలు

దెబ్బతింటున్న మొక్కజొన్న,

వరి, పత్తి పంటలు

నాణ్యత పడిపోతోందని పంటలకు

ధర తగ్గిస్తున్న వ్యాపారులు

ఎల్‌నినో, తుపాన్ల ప్రభావంతో

మనోవేదన చెందుతున్న రైతులు

పత్తి తీయలేకపోతున్నాం

జాగ్రత్తలు తీసుకోవాలి

దిగుబడులపై ఆందోళన

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 2.20 లక్షల ఎకరాల్లో పత్తి, 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలను సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతులకు ఇప్పుడు వర్షాలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రస్తుతం తొలి విడత పత్తి తీతలు ముమ్మరంగా సాగుతుండగా, ఎకరాకు సుమా రు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

తడిసిన పత్తి, మొలకెత్తుతున్న కాయలు

ఇప్పటికే అర్నబ్‌ తుపాన్‌ కారణంగా సుమారు వారం రోజులపాటు పత్తి తీతలు నిలిచిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ తీతలు ప్రా రంభిద్దామనుకునే సమయంలో మురసు తుపాన్‌తో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పత్తి తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతినే ప్రమాదం నెలకొంది. తడిసిన పత్తిలో మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి కోతలకు బ్రేక్‌

జిల్లాలో పలుచోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. కోతకు సిద్ధమైన వరి పంటలను, ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టంగా మారింది. వర్షాలు ఇలాగే కొనసాగితే కోతలు మరో వారం రోజులపాటు నిలిచిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిపోవడం, రంగు మారడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆదుకోవాలని వేడుకోలు

వరుస వర్షాలు, నిలిచిన పంట పనులు, ధరల తగ్గుదలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అవసరమైన సూచనలు, సహాయక చర్యలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో 16 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు కోతకు రాని పంటలకు ఊపిరి పోస్తుండగా, కోతకు వచ్చిన పంటలను దెబ్బతీస్తున్నాయి. అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు కోతకు సిద్ధంగా ఉండడంతోపాటు కొన్ని చోట్ల కోతలు కూడా పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన పంటలు కూడా తడిసిపోతున్నాయి. వర్షాలు తగ్గాక చీడపీడలు సోకకుండా పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, దీనివల్ల అదనపు ఆర్థికభారం పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, మంగళవారం అత్యధికంగా అశ్వారావు పేటలో 65 మి.మీ, అత్యల్పంగా కరకగూడెంలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది.

వర్షాల కారణంగా పంటల నాణ్యతపై ప్రభావం పడుతుండగా, మార్కెట్లో ధరలు కూడా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు క్వింటా పత్తి ధర సుమారు రూ.9 వేల వరకు పలకగా, ప్రస్తుతం రూ.7,500కు పడిపోయిందని చెబుతున్నారు. మరోవైపు క్వింటా ధాన్యం ధర రూ.3,500 నుంచి రూ.2,500కు తగ్గినట్లు పేర్కొంటున్నారు. తేమ, నాణ్యత తదితర అంశాల ప్రభావంతో వ్యాపారులు, మిల్లర్లు ధరలు తగ్గిస్తుండటంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.

ఐదెకరాల్లో పత్తి సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడుతుండటంతో పత్తి తీయలేకపోతున్నాం. ఇప్పటికే వర్షాలకు పత్తి తడిసిపోయింది. వాతావరణం అనుకూలించక తీతలు నిలిచిపోయాయి. పత్తి నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే చేతి కొచ్చే వేళ ప్రకృతి ఆటంకం కలిగిస్తోంది. ప్రభుత్వం మా పరి స్థితిని గుర్తించి ఆదుకోవాలి. –ఎండీ అక్తర్‌,

రైతు, పద్మాపురం, కరకగూడెం మండలం

వర్షాలకు పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. తుపాన్‌ ప్రభావంతో ఇంకా వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వానాకాలం సీజన్‌లో ఆలస్యంగా పంటలు వేసుకున్నవారికి ఈ వర్షాలు ఎంతో ఉపయోగం. వరికోతలు ఇప్పటివరకు కేవలం 5శాతం మాత్రమే పూర్తయ్యాయి. రైతులు వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు పాటించాలి.

– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement