కొత్తగూడెంఅర్బన్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలను మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లా విద్యాశాఖ అధికారి శంభూప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలోని 24 పీఎంసీలు పాఠశాలల బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో అన్నపురెడ్డిపల్లి టీజీటీడబ్ల్యూర్జేసి, రెండో స్థానంలో దమ్మపేట టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్ నిలువగా, బాలికల విభాగంలో సుడిమళ్ల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్ మొదటి స్థానం, రెండో స్థానంలో ములకలపల్లి టీజీటీ డబ్ల్యూఆర్ఎస్ నిలి చింది. ఈ కార్యక్రమంలో ఏఎంఓ మాధవరావు, ఎస్జిఎఫ్ సెక్రెటరీ భావ్‌సింగ్, బి.ప్రేమ్‌కుమార్, వి.నరేష్ పాల్గొన్నారు.


