నాణ్యమైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

కరకగూడెం/మణుగూరురూరల్‌: ప్రజలకు నాణ్య మైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ సూచించారు. మంగళవారం పినపాక, కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశా రు. రికార్డులను, ఫార్మసీ, ల్యాబ్‌లను పరిశీలించా రు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశా రు. మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని చేపల మార్కెట్‌ ప్రాంతంలో పర్యటించారు. పారిశుద్ధ్యంపై స్థానికులకు పలు సూచనలు చేశారు. అనంతరం శివలింగాపురంలోని మణుగూరు ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని సందర్శించి ఆశాడే కార్యక్రమానికి హాజరై నెలవారి సమీక్ష నిర్వహించారు. రికార్డులు, నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. మిషన్‌ భగీ రథ నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలన్నా రు. అనంతరం ఆశా కార్యకర్తలకు అవసరమైన పరీక్షల కిట్లు, మందులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌ వైద్యాధి కారులు మోహన్‌, వీరస్వామి, రవితేజ, పోలెబోయిన కృష్ణయ్య పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement