●పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు
దమ్మపేట: మండలంలోని అల్లిపల్లి గ్రామ శివారు నుంచి మందలపల్లికి సోమవారం అర్ధరాత్రి సమయంలో అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లలో మట్టిని తరలించారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టి తరలిస్తుండగా స్థాని కులు అడ్డగించి, నిలదీశా రు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ట్రాక్టర్లను గమనించినా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో బహిరంగంగా జరుగుతున్న మట్టి దందాపై సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఎస్సై రాజేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. అనుమతులు లేకుండా మట్టి రవాణాకు పాల్పడినవారిపై బైండోవర్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.


