భద్రాచలం న్యాయమూర్తి బదిలీ | - | Sakshi
Sakshi News home page

భద్రాచలం న్యాయమూర్తి బదిలీ

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం జ్యుడీషియ ల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వి.శివనాయక్‌ నల్లగొండకు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు వురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శివనాయక్‌ను నల్లగొండ ప్రిన్సిపల్‌ జూని యర్‌ సివిల్‌ జడ్జిగా నియమిస్తూ, ఈ నెల 12 లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. భద్రాచలంలో ఆయన స్థానాన కొత్త న్యాయమూర్తిని నియమించే వరకు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దుర్గాభవానికి బాధ్యతలు అప్పగించారు.

న్యాయమూర్తి

బిందుప్రియ..

ఖమ్మం లీగల్‌: ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఏపూరి బిందుప్రియ బదిలీ అయ్యారు. ఆమెను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏఐకేఎస్‌ సభలను

జయప్రదం చేయాలి

రుద్రంపూర్‌: ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ కోరారు. మంగళవారం మంచికంటి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15న లక్షమంది రైతులతో బహిరంగ సభ, పదివేల మంది రెడ్‌ షర్ట్‌ వలంటీర్లతో కవాతు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుంచి నాలుగు వేల మంది రైతలను సభలకు తరలి స్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్‌, అన్నవరపు సత్యనారాయణ, కారం పుల్లయ్య, కే.బ్రహ్మా చారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్‌, కున్సోత్‌ ధర్మా పాల్గొన్నారు.

ముందస్తు బెయిల్‌

విచారణ వాయిదా

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో గ్యాస్‌ గోదాం మేనేజర్‌ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్ల విచారణను హైకోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజులపూడి రజిత, విలేకర్లు ఎల్‌.రాజేష్‌, నాగచంద్రరావు అలియాస్‌ నాగచందు, మహ్మద్‌ అబ్దుల్‌ ఖలీం కలిసి ఒక పిటిషన్‌, మరో నిందితుడైన విలేకరి తలారి రవికుమార్‌ విడిగా ముందుస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసిన విషయం విదితమే. ఈ రెండు పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా, ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది ఎస్‌.మదన్‌ మోహన్‌రావు హాజరై గడువు కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఇళ్ల తొలగింపునకు అధికారుల కసరత్తు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా దక్షిణ ద్వారం నుంచి గోదావరి నదికి వెళ్లే మార్గంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వైపు ఉన్న ఇళ్ల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించేందుకు మంగళవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కీర్తిఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మొత్తం 57 ఇళ్లలో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా 62 మందిని పరిశీలించి ఐదుగురిని గుర్తించారు. మిగిలిన వివరాల సేకరణకు బుధవా రం పూర్తిస్థాయిలో సర్వే చేపట్టనున్నట్లు రెవె న్యూ అధికారులు వెల్లడించారు.

పొగాకు రహిత సమాజ నిర్మాణానికి కృషి

ముదిగొండ: పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతీఒక్కరు పాటుపడాలని ఖమ్మం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అరుణాదేవి సూచించారు. ముదిగొండ ప్రభుత్వ జూని యర్‌ కాలేజీలో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పొగాకు వినియోగంతో యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement