సూపర్‌బజార్(కొత్తగూడెం): కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సేవలు, సలహాలు, సూచనలతో రైతులు అధిక దిగుబడులు సాధించాలని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కేవీకే, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మెరుగైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అన్నా రు. డిప్యూటీ మేయర్ ఎస్.లలితకుమారి మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతో వ్యవసాయ కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడవచ్చని అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంతో సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబూరావు, సీనియర్ శాత్రవేత్త టి.భరత్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ జి.సునీల్ కుమార్, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సృజన్, డాక్టర్ శిరీష, డాక్టర్ రమేష్, బి శివ పాల్గొన్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు.
కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్


