నేలకొండపల్లి: పట్టపగలే ఇంటి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు నగదు, వెండి పాత్ర చోరీ చేశారు. మండలంలోని బైరవునిపల్లికి చెందిన మల్లెబోయిన శ్రీనివాసరావు, ఆయన భార్య, కుమారుడు, కోడలు సోమవారం తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన గుర్తుతెలియని వ్యక్తులు ముందు, వెనుక రెండు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో రెండు బీరువాలు పగలగొట్టి రూ.10వేల నగదుతో పాటు వెండి పాత్ర ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


