రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రెండు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

దమ్మపేట: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... సోమవారం దమ్మపేట శివారులోని జయలక్ష్మి టాకీస్‌ సమీపంలోని వంతెనపై బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న, దమ్మపేటకు చెందిన సమీప బంధువులు మునగాల ఫకీర్‌(60), మునగాల బాలకృష్ణ(40) తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పార్కలగండి గ్రామానికి చెందిన యువకుడు కణితి వినోద్‌ బైక్‌పై వెళ్తున్న క్రమంలో అదే గ్రామ శివారులో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

సైబర్‌ క్రైమ్‌ కేసులో ఐదుగురు రిమాండ్‌

అశ్వాపురం: ప్రైవేట్‌ ఉద్యోగి అకౌంట్‌ నుంచి నగదు స్వాహా చేసిన ఐదుగురిపై సైబర్‌ క్రైం కేసు నమోదు కాగా, రిమాండ్‌ విధించారు. అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చుంచు సునీల్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించిన వ్యక్తులు ఖాతా వివరాలు సేకరించి రూ.51,956 స్వాహా చేశారు. దీంతో ఆయన సెప్టెంబర్‌ 6న అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఎల్ల య్య ఆధ్వర్యాన సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో కలిసి దర్యాప్తు చేశారు. ఈమేరకు అభిషేక్‌ కుమార్‌, అశుతోష్‌కుమార్‌, కుమార్‌ నిషు, రితేష్‌కుమార్‌, అభినాష్‌కుమార్‌ నిందితులని తేలగా, వారు ఇప్పటికే ఇతర కేసుల్లో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు.

పంట కాల్వలోకి దూసుకెళ్లిన వాహనం

నేలకొండపల్లి: అదుపు తప్పిన ఓ వాహనం పంట కాల్వలోకి దూసుకెళ్లింది. కూసుమంచికి చెందిన వ్యక్తి ఐస్‌క్రీమ్‌ అమ్మే వాహనంతో సోమవారం నేలకొండపల్లికి వస్తున్నాడు. మండలంలోని కోనాయిగూడెం సమీపానికి రాగానే మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు తాళ్ల సాయంతో వాహనాన్ని బయటకు లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement