కారేపల్లి: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని సాధిస్తామని, అందుకోసం సంఘం బాధ్యులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని పీఆర్‌టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు తెలిపారు. కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తరఫున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ పోటీ చేయనున్నారని తెలిపారు. ఆయనను గెలిపించుకుని ఉపాధ్యాయ, పట్టభధ్రుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధించుకుందామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు నరసింహ, చంద్రశేఖర్, రాష్ట్ర, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎం.వేణుమాధవ్‌రావు, జి.విజయ అమృత్‌కుమార్‌తో పాటు అజ్మీర సోమ్లా, వి.విజయలక్ష్మి, బాలిన వెంకటరెడ్డి, హెచ్‌ఎం సాల్మన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రావు


