ప్రశాంతంగా రాత పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా రాత పరీక్ష

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

కొత్తగూడెంఅర్బన్‌: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగిరీ–1 పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 63 పోస్టులు ఉండగా, ఇంటర్నల్‌ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించగా, 258 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సీపీ కెమెరాల నిఘా మధ్య పరీక్ష నిర్వహించారు. పరీక్షను రిక్రూట్‌మెంట్‌ సెల్‌ జీఎం ఏజేఎం మురళీధరరావు, విజిలెన్స్‌ జీఎం మురళీధరరాజు పర్యవేక్షించారు. నియామకాలు పూర్తిగా మెరిట్‌పై ఆధారపడి ఉంటాయని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని జీఎం మురళీధర్‌రావు సూచించారు. పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి సింగరేణి వెబ్‌సైబ్‌లో, సింగరేణి ప్రధాన కార్యాలయ ముఖద్వార నోటీస్‌ బోర్డుపై అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement