పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు | - | Sakshi
Sakshi News home page

పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మహిళా ప్రధాన

కార్యదర్శి కనగాల చైతన్య

భద్రాచలంటౌన్‌: భద్రాచలం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య విమర్శించారు. ఆదివారం పట్టణంలోని హరి త హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించాయని ఆరోపించారు. భద్రాచలంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు ఎదురుచూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. బూర్గంపాడు రహదారిని అభివృద్ధి చేయాలని, చర్ల–వెంకటాపురం రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, దుమ్ముగూడెం ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు.

5నుంచి రాష్ట్రస్థాయి

అండర్‌–19 కరాటే టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మం జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్‌–19 కరాటే పోటీలను ఈనెల 5నుంచి 7వ తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించనున్నారు. సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని క్రీడాసంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం తెలి పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది బాలబాలికలు హాజరవుతారని పేర్కొన్నారు.

సమసమాజ స్థాపనతోనే

అమరవీరులకు నివాళి

ఖమ్మం మయూరిసెంటర్‌: పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం, రైతాంగం, ప్రజలు ఐక్యంగా పోరాడి దోపిడీ లేని సమసమాజాన్ని స్థాపించుకోవడం ద్వారా అమరవీరులకు నివాళి అర్పించాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన అమరవీరుల సంతాప సభలో ఆయన అమరవీరుల స్థూపం వద్ద ఎర్రజెండా ఆవిష్కరించి మాట్లాడారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో స్వాతంత్య్రం, భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో ప్రాణాలర్పించారని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement