మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యం

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

కొత్తగూడెంఅర్బన్‌: యువత, విద్యార్థులు మత్తు పదార్థాలను దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖాధి కారి డి.వాసంతి తెలిపారు. కొత్తగూడెం బాబుక్యాంప్‌లోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ సదస్సులో ఆమె మాట్లాడారు. డ్రగ్స్‌ వాడ కం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని, సమాజంలో గౌరవం కోల్పోతారని తెలిపారు. ఈమేరకు విద్యార్థి దశలోనే అవగాహన పెంచుకుని, నష్టాలను ఇంకొందరికి వివరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానోపాధ్యాయురాలు బి నీరజ, ఉపాధ్యాయులు రమాదేవి, సౌందర్య, షేక్‌ దస్తగిరి, స్టెల్లా జ్ఞానవతి, సరోజినీ, దేవేందర్‌, బేగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement