సీఈసీ జ్ఞానేష్‌ రాజీనామా చేయాల్సిందే... | - | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేష్‌ రాజీనామా చేయాల్సిందే...

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): దేశవ్యాప్తంగా ‘సర్‌’ పేరుతో జాబితా నుంచి ఓటర్లను అక్రమంగా తొలగించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. సీఈసీ రాజీనామా, అర్హుల పేర్లు కొనసాగించాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో సుమారు 20శాతం ఓట్లను అక్రమంగా తొలగించిందని మండిపడ్డారు. అర్హులైన పౌరుల ఓటు హక్కును కొల్ల గొడుతూ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను పదవి నుంచి డిస్మిస్‌ చేయాలని కోరారు. ధర్నా అనంతరం కాంగ్రెస్‌ శ్రేణులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ప్రతినిధి బృందాన్ని అనుమతించడంతో కలెక్టర్‌ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జ్‌ లింగోజి, రాష్ట్ర, జిల్లా నాయకులు నాగ సీతారాములు, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, సిరిపురపు లలితకుమారి, కొత్వాల శ్రీనివాసరావు, కంచర్ల చంద్రశేఖరరావు, తూము చౌదరి, వీరబాబు, జే.వీ.చౌదరి, ఏనుగుల అర్జునరావు, వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎం.పెద్దబాబు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement