భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం సీతా రాముల కల్యాణం వైభవంగా సాగింది. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశా రు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో కొలువు దీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
ఏకలవ్య విద్యార్థులకు అవార్డులు
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం సీతా రాంపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన నేషనల్ అకాడమీ ఫర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘గ్రీన్ ఇండియా మిషన్ ఆర్ట్ కాంపిటీషన్’లో ప్రతిభ కనబర్చగా, ఐదుగురికి గ్రీన్ ఇండియా కళారత్న, 98 మందికి రికగ్నైజేషన్ అవార్డులు దక్కాయని ప్రిన్సిపాల్ విజేంద్రసింగ్ తెలిపారు. అవార్డులకు ఎంపికై న కుర్సం రిషిత, సోందే శర్మిల, కారెం పూజశ్రీ, కోడి గౌతమ్, నూపా అరుణ్ కార్తీక్‌దొరతో పాటు ఆర్ట్ టీచర్ ఎన్.విజయ్‌ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.
సమస్యలకు
సత్వర పరిష్కారం
భద్రాచలం: గిరిజనులు ఇచ్చే దరఖాస్తులు, వినతిపత్రాలను సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన సూచించారు. భద్రాచం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆమె దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన డీడీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అర్హులైన గిరిజనులు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ప్రతీ దరఖాస్తును నమోదు చేసి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ ఆనంద్‌కుమార్, వివిధ విభా గాల అధికారులు మధుకర్, సైదులు, ఉదయ్ కుమార్, సున్నం రాంబాబు, వేణు, గనియా నాయక్, అనసూయ, తదితరులు పాల్గొన్నారు
రేక్ పాయింట్‌కు 1,320 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు క్రిబ్‌కో కంపెనీకి చెందిన 1,321.20 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 521.20 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 మె. టన్నులు కేటాయించినట్లు ఖమ్మం డీఓఏ ధనసరి పుల్లయ్య తెలిపారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
నేడు సింగరేణి ప్రధాన కార్యాలయంలో వార్షిక సమావేశం
రుద్రంపూర్: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం 105వ వార్షిక జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అలాగే, రాష్ట్రం తరఫున ఉన్నతాధికారులతో పాటు సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, షేర్లపై ఆదాయం, కంపెనీ వ్యయాలపై సమీక్షిస్తారు. కాగా, ఈ సమావేశాన్ని ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


