పాల్వంచ: జిల్లాలో మాతా, శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, ఉద్యోగులు పనిచేయాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ సూచించారు. పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సమావేశ మంది రంలో సోమవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్యం, వ్యాక్సిన్లపై నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మాతా, శిశు మరణాల తగ్గింపునకు గర్భిణుల వివరాలు నమోదు చేసి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నవభారత్ ఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో నిర్వహించిన సదస్సులో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల ఎదురయ్యే నష్టాలను వివరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ సుమతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


