సూపర్‌బజార్(కొత్తగూడెం): రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా డాక్టర్ ఎస్‌ఎల్.కాంతారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల అధికారి సీపీఓ సునీత సోమవారం ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా చల్లగుల్ల నాగేశ్వరరావు, కోశాధికారిగా తోటమల్ల వెంకట బాలయోగి, స్టేట్ కమిటీ మెంబర్‌గా వై.సూర్యనారాయణ ఎన్నికయ్యారని తెలిపారు. జిల్లా కమిటీ మెంబర్లుగా ఎడవల్లి కృష్ణ, అవులూరి సత్యనారా యణ, ఎం.బాలనర్సింహారెడ్డి, బి.హరిచంద్ర, బండారు బాలగంగాధర్‌తిలక్, పి.దేశప్ప, జక్కం ప్రసాద్, కంభంపాటి రవి, ఖండేల్‌వాల్ సతీష్, పాతూరి పాండురంగ విఠల్, వేముల కామేశ్వరరావు ఎన్నికవగా నియామకపత్రాలు అందుకున్నాక కలెక్టర్ అంకిత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
డీఈఓగా శంభూప్రసాద్
కొత్తగూడెంఅర్బన్:జిల్లా విద్యా శాఖాధికారిగా శంభూప్రసాద్ ను పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి యోగితారాణా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డీఈఓగా ఉన్న డి.వాసంతిని ఖమ్మం బదిలీ చేశారు. ఆ స్థానంలో విద్యాశాఖ ఏడీగా ఉన్న శంభూప్రసాద్‌ను డీఈఓ (ఎఫ్‌ఏసీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


