ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

పాల్వంచ: పేద ఆర్యవైశ్యుల విద్య, వివాహా లకు ఆర్థికసాయం కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు శ్రీ వాసవీ ఆర్యవైశ్య విద్య, వివాహ సహాయ ట్రస్ట్‌ అధ్యక్షుడు సీహెచ్‌.దేవీప్రసాద్‌ తెలిపారు. పాల్వంచ, కొత్తగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట, బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పేద ఆర్యవైశ్య విద్యార్థులు, కుటుంబాలు ఈనెల 15 నుంచి 27వ తేదీలోగా వరకు దరఖాస్తులు అందించాలని సూచించారు. వివరాల కోసం 98481 83504, 94931 22310 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

‘ట్రస్మా’ జిల్లా అధ్యక్షుడిగా రవి

ఇల్లెందు: తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడిగా భద్రాచలానికి చెందిన పి.రవి ఎన్ని కయ్యారు. కొత్తగూడెంలో ఆదివారం అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించగా పలువురు పోటీ పడ్డారు. ఈమేరకు అధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా పాల్వంచకు చెందిన ఎం.కృష్ణ, కోశాధికారిగా ఇల్లెందుకు చెందిన సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు డివిజన్లలోని పాఠశాలల కరస్పాండెంట్ల సమక్షాన ఈ ఎన్నిక జరిగింది.

30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

మణుగూరుటౌన్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు శని వారం రాత్రి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గుట్టమల్లారం గ్రామానికి చెందిన నర్సింహారావు పలువురి లబ్ధిదారుల నుంచి 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొన్నాడు. అనంతరం చింతూరు సమీపాన ఓ సంతలో ఆదివాసీలకు విక్రయించేందుకు ఆదివారం ట్రాలీలో తరలిస్తున్నాడు. ఈక్రమాన బంగ్లాస్‌ ఏరియాలో పట్టుకుని ట్రాలీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

అశ్వాపురం: ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన దేవినేని సీతయ్య(45) మిట్టగూడెం గ్రామంలో కిరాయికి ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా సీతయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుండగా..ఆదివారం ఇంట్లో తగాదా జరి గింది. దీంతో మనస్థాపానికి గురైన ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉండగా.. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.

హతుడి కుటుంబం వివరాల కోసం ఆరా

గుండాల: ఆళ్లపల్లి మండలం సుద్దరేవులో హత్యకు గురైన గుర్తుతెలియని వ్యక్తి బంధువుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈమేరకు ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి నాలుగేళ్ల క్రితం వలస వచ్చి సుద్దరేవులో ఉంటున్న పూనెం రామ్‌ నారాయణ గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం విదితమే. గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చాక జల్లేరు వాగు సమీపాన పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చగా, ఆయన కుటుంబ వివరాలు తెలిసిన వారు 87126 82073(టేకులపల్లి సీఐ), 87126 82078(ఆళ్లపల్లి ఎస్సై) నంబర్లకు సంప్రదించాలని ఇవ్వాలని సూచించారు.

ఆరుగురు పందెంరాయుళ్లపై కేసు నమోదు

దమ్మపేట: మండల పరిధిలోని జలవాగు గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో కోడి పందేలు నిర్వహిస్తున్న పందెంరాయుళ్లపై పోలీసులు ఆదివా రం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జలవాగు శివారులోని పామాయిల్‌ తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడిచేశారు. ఆరుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రెండు బైక్‌లు, రూ.3,500ల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌ తెలిపారు.

పేకాట, కోడిపందేలపై పోలీసుల నిఘా

దుమ్ముగూడెం: పేకాట, కోడిపందేలు, గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య తెలిపారు. ఈమేరకు ఆదివారం ఓ పేకాట స్థావరంపై దాడి చేయగా నిర్వాహకులు, ఆటగాళ్లు పరారయ్యారని పేర్కొన్నారు. వీరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మండల వ్యాప్తంగా రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశామని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిస్తే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.

మహిళను

ఢీకొట్టిన లారీ

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. రామాలయం సమాచార కేంద్రం ఎదురు మెయిన్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాచలం మీదుగా సారపాక వైపు వెళ్తున్న ఇసుక లారీ మహిళను ఢీకొట్టి సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో మృతదేహం రెండు భాగా లుగా విడిపోయి ఛిద్రమై గుర్తుపట్ట లేని విధంగా మారింది. ఈమేరకు భద్రాచలం సీఐ నాగరాజు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే, ప్రమాదానికి కారణమైన లారీని వదిలి డ్రైవర్‌ పరారయ్యాడని సీఐ తెలిపారు. కాగా, మృతురాలిని యాచకురాలిగా భావిస్తున్నారు.

ఛిద్రమైన మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement