సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లాలో 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెంలో 3,384, ఇల్లెందులో 602, భద్రాచలంలో 1,121, మణుగూరులో 422, దమ్మపేటలో 245 కేసులు పరిష్కారమైనట్లు న్యాయాధికార వర్గాలు తెలిపాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను పరిష్కరించుకుంటే కాలం, ధనం ఆదా అవుతాయని అన్నారు. మరో కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.ప్రేమలత, న్యాయమూర్తులు కె.సాయిశ్రీ, బి.రవికుమార్, వి.వినయ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కిరణ్ కుమార్, లైజన్ ఆఫీసర్ రాఘవ పాల్గొన్నారు.


