రీ సర్వే వేగవంతంగా
పూర్తి చేయాలి
● కలెక్టర్ అంకిత్● ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
చుంచుపల్లి: విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది సేవలు, స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. హాజరైన కలెక్టర్, ఇతర అధికారులు విధి నిర్వహణలో ప్రా ణాలు కోల్పోయిన చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎప్పీ రోహిత్‌రాజు మా ట్లాడుతూ అటవీ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో తొందరపాటు, నిర్లక్ష్యానికి తావి వ్వకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొదట ప్రకాశం స్టేడి యం నుంచి సెంట్రల్ పార్క్ వరకు అటవీ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మహేందర్, సర్పంచ్ అజ్మీరా లైలా,అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అశ్వాపురం: భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రా మంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. మూడు తరాలుగా భూ ములను అనుభవిస్తున్నా రికార్డుల్లో ఉపవిభజనలు నమోదు కాకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోదావరి వరదలు, భూమి కోతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాత భూ సరిహద్దులు మారి పోయాయని, సీతారామ ప్రాజెక్టు పరిసరాల్లో కొన్ని చోట్ల సుమారు 250 మీటర్ల మేర మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాత రికా ర్డులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భూములపై స్పష్టత కల్పించాలని సూచించారు. రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించగా, భారజల కర్మాగార సీఎస్‌ఆర్ నిధులతో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు.


