చిన్నతనంలోనే తల్లిదండ్రులను
కోల్పోయిన హర్షితారెడ్డి
నాన్నమ్మ, తాతయ్య అండతో
ఉన్నత చదువులు
భద్రాచలంఅర్బన్: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కష్టాలకు ఎదురొడ్డి ఉన్నత చదువులు పూర్తి చేసిన జిల్లాకు చెందిన యువతి హర్షితారెడ్డి సాంకేతిక రంగంలో ప్రతిభ చాటుతోంది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి – కనకరత్నం దంపతుల కుమార్తె హర్షిత చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి నాన్నమ్మ సక్కుబాయి, తాతయ్య పాపిరెడ్డి సంరక్షణలో పెరిగింది. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్)కోర్సు 2025లో పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో డెవలపర్‌గా పనిచేస్తుండగా, హర్షితారెడ్డి, హరినాథ్ కలిసి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. పౌర సేవలు, అత్యవసర సాయం, ఫైర్ ఎన్‌ఓసీ, వర్షపాతం, చెరువులు, భూముల వివరాలు, హైడ్రా పరిధి తదితర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్‌కు హర్షిత పోర్టల్ పనితీరు, సేవలను వివరించగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


